Home క్రికెట్ DC vs KKR: తెలుగుగడ్డపై మరోసారి పరుగుల వరద.. రెచ్చిపోయిన కోల్‍కతా.. తేలిపోయిన ఢిల్లీ.. ...

DC vs KKR: తెలుగుగడ్డపై మరోసారి పరుగుల వరద.. రెచ్చిపోయిన కోల్‍కతా.. తేలిపోయిన ఢిల్లీ.. ఎస్‍ఆర్‌హెచ్ రికార్డు సేఫ్

0

పంత్, స్టబ్స్ పోరాడినా..

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (18), పృథ్వి షా (10), మిచెల్ మార్ష్ (0), అభిషేక్ పోరెల్ (0) విఫలమవటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ దశలో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. త్వరగానే ఆలౌటవుతుందా అని అనిపించింది. అయితే, ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 55 పరుగులు చేశాడు. అర్ద శకతంతో పోరాడాడు. అయితే, 13వ ఓవర్లో పంత్ ఔటయ్యాడు. ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా కాసేపు పోరాడాడు. 32 బంతుల్లోనే 54 పరుగులతో రాణించాడు. పంత్, స్టబ్స్ పోరాడినా ఫలితం లేకపోయింది. తర్వాతి బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌటై.. భారీ పరాజయం మూటగట్టుకుంది. కోల్‍కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభర్ అరోరా చెరో మూడు, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. రసెల్, నరేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్‍లో వైజాగ్‍లో ఇదే చివరి మ్యాచ్.

Exit mobile version