Kurchi Madathapetti Song: మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్ తో ఇరగదీసిన గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలోనూ ఓ ఊపు ఊపేస్తోంది. ఈసారి ఏకంగా నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) మ్యాచ్ మధ్యలో ఈ సాంగ్ ప్లే చేయడం, దానిపై అక్కడి డ్యాన్సర్లు స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.