ఆడుజీవితం గురించి..
ఆడుజీవితం సినిమా కోసం సుమారు 11ఏళ్లు కష్టపడ్డారు దర్శకుడు బ్లెస్సి. ఈ చిత్రం పృథ్విరాజ్ సుకుమారన్ నటనకు అందరూ సలాం కొడుతున్నారు. గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి బానిసలా మారిన నజీబ్ అనే వ్యక్తి జీవిత ఘటనలతో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు. ఎడారి దేశం నుంచి బానిసత్వం నుంచి తప్పించుకునేందుకు నజీబ్ ఎదుర్కొన్న సవాళ్లను ఎమోషనల్‌గా చూపించారు. ఆడుజీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు బ్లెస్సీ రూపొందించారు. ఈ మూవీలో అమలాపాల్, జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, తలిబ్ అల్ అలూషి ఈ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా నిలిచింది.