Veg Hakka Noodles: వెజ్ హక్కా నూడుల్స్‌కు అభిమానులు ఎక్కువే. చైనీస్ వంటకాల్లో ఇది కూడా ఒకటి. అయితే అవి ఇంట్లో చేయలేమని అనుకుంటారు… నిజానికి వెజిటబుల్ హక్కా నూడుల్స్‌ని చాలా సులువుగా ఇంట్లో చేసేయొచ్చు. ప్రతి తల్లి తన పిల్లలకు దీన్ని ఆరోగ్యంగా తినిపించవచ్చు. ఇంట్లోనే చేస్తారు కాబట్టి ఎలాంటి రంగులు, రసాయనాలు వాడకుండా దీన్ని టేస్టీగా చేయవచ్చు. అయితే నూడుల్స్‌ను మైదాతో చేసినవే ఎక్కువగా లభిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో రైస్ నూడుల్స్, మిల్లెట్స్ నూడుల్స్, గోధుమ పిండితో చేసిన నూడుల్స్ కూడా ఉన్నాయి. ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకోండి. మైదాతో చేసిన నూడుల్స్‌ను దూరం పెట్టడమే మంచిది.