ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనేందుకు వీలు లేదని సీఈసీ ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, వాలంటీర్లు ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మీనా, ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల మేరకు 42 మందిపై వేటు వేసినట్లు వెల్లడించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేయవద్దని మరోసారి ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.