Thursday Motivation: కొందరు ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బును చూసి గర్వంగా ఫీల్ అవుతారు. ఇతరులను చూసి చులకనగా మాట్లాడతారు. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడుతూ ఉంటారు. అలాంటివారు కుండను చూసి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నిండు కుండ దగ్గరకు వెళ్లి అడిగాడట… ‘నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు. ఇది ఎలా సాధ్యం’ అని. అప్పుడు కుండ ‘నేను ఎప్పుడూ ఒకే విషయాన్ని గుర్తు పెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టి నుంచే, మళ్లీ మట్టిలోనికే వెళ్తాను. మధ్యలో ఈ ఆవేశం, పొగరు, గర్వం లాంటివి అవసరమా’ అని నవ్విందట. ధనవంతులమని విర్రవీగుతున్నవారు ఈ కుండ చెప్పిన నీతిని అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నా వారు కలిసేది మట్టిలోనే.