“డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ, టిల్లు స్క్వేర్‌పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ, కథ మాత్రం వేరేలా ఉంటుంది” అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు. ఈ ఈవెంట్‌లో మిగతా వారు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.