బాపట్ల జిల్లాలోని కొరిశపాడు-రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎమర్జెన్సీ రన్‌వేపై యుద్ధ విమానాలు దిగాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను హైవేపై ల్యాండింగ్ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించి కార్యక్రమం నిర్వహించారు. ఈ దృశ్యాలు చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎన్-32 కార్గో విమానం సైతం ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.