Home ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేట ప్రజాగళం సభ-సీఎం ఒక సారా వ్యాపారి అని పవన్ విమర్శలు-chilakaluripet tdp bjp jsp...

చిలకలూరిపేట ప్రజాగళం సభ-సీఎం ఒక సారా వ్యాపారి అని పవన్ విమర్శలు-chilakaluripet tdp bjp jsp alliance prajagalam meeting pm modi chandrababu pawan kalyan attended live updates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

ప్రజాగళం సభ

TDP BJP JSP Alliance : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడిలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించారు.

Sun, 17 Mar 202412:10 PM IST

సీఎం జగన్ సారా వ్యాపారి- పవన్ కల్యాణ్

ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇసుక పేరుతో వైసీపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందం అన్నారు. అమరావతి అండగా ప్రధాని మోదీ అన్నారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి అని విమర్శించారు. ఏపీ రావాల్సిన పరిశ్రమలను వైసీపీ నేతలు తరిమేశారని ఆరోపించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

Sun, 17 Mar 202412:03 PM IST

300 ఎకరాల సభాప్రాంగణం

ప్రజాగళం సభకు ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. కేవలం గంట వ్యవధిలో 300 ఎకరాల సభాప్రాంగణం నిండిపోయింది. బొప్పూడి సభా ప్రాంగణం జనజాతరలా కనిపిస్తుంది.

Sun, 17 Mar 202411:59 AM IST

విద్యుత్ స్తంభాలు దిగాలని కోరిన ప్రధాని మోదీ

అభిమానులు విద్యుత్ స్తంభాలు ఎక్కడం పై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగం ఆపి విద్యుత్ స్తంభాలు దిగాలని కార్యకర్తలను కోరారు. విద్యుత్ టవర్లు దిగి పోవాలని ప్రధాని సూచించారు. పోలీసులు టవర్లు ఎక్కిన వారిని కిందకు దింపాలని కోరారు.

Sun, 17 Mar 202411:55 AM IST

ఏపీ అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యం

దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు.

గత అయిదేళ్లలో ఏపీలో అభివృద్ధి శూన్యం, కేంద్రం సహకారంతోనే కొద్దిపాటి అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు.

Sun, 17 Mar 202411:54 AM IST

కూటమి పంతం, వైసీపీ పాలన అంతం

ప్రజాగళం సభలో టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అయిదేళ్ల అరాచకపాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదని ఆరోపించారు. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిందన్నారు. కూటమి పంతం, వైసీపీ పాలన అంతం ఈ నినాదంతోనే ముందుకెళ్తామన్నారు.

Sun, 17 Mar 202411:51 AM IST

కాసేపట్లో కీలక నేతల ప్రసంగాలు

మూడు పార్టీలో నినాదాలతో బొప్పూడి సభా ప్రాంగణం మారుమోగింది. కరతాళధ్వనులతో నేతలకు కార్యకర్తలు స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ , ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Sun, 17 Mar 202411:49 AM IST

40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగం

  • సభా ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ
  • ప్రధాని మోదీ మాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 కోట్లమంది ప్రజలు
  • ఏపీ పునర్నిర్మాణానికి మోదీ ఏవిధమైన భరోసా ఇస్తారోనని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు
  • ప్రజాగళం సభలో 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
  • చెరో 15 నిమిషాల చొప్పున ప్రసంగించనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్
  • ప్రజాగళం వేదికపైకి మూడు పార్టీలకు చెందిన 30 మందికి అనుమతి, ఇప్పటికే సభాప్రాంగణానికి చేరుకున్న కూటమి సీనియర్ నేతలు

Sun, 17 Mar 202411:46 AM IST

భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు

బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాల కనిపిస్తున్నాయి. తమ పార్టీల జెండాలతో సభా ప్రాంగణానికి మూడుపార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు.

Sun, 17 Mar 202411:45 AM IST

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాల కనిపిస్తున్నాయి. తమ పార్టీల జెండాలతో సభా ప్రాంగణానికి మూడుపార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు.

Sun, 17 Mar 202411:42 AM IST

ప్రజాగళం సభకు భారీగా చేరుకున్న జనం

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడిలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. సభకు భారీగా ప్రజలు చేరుకున్నారు.

Exit mobile version