బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) ఈడీ మరి కాసేపటిలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) ఎదుట హాజరుపరచనుంది.ఈ మేరకు నాగ్ పాల్ బెంచ్ ముందు కవితను హాజరు పరిచి, కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ ( ED ) కోరనుంది.
ఇప్పటికే కవితకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో నిన్న కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆమెను ఈడీ కార్యాలయంలో ఉంచారు.ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.మరోవైపు కవిత అరెస్ట్ తో ( Kavitha Arrest ) పాటు రిమాండ్ రిపోర్టు, కస్టడీని ఆమె తరపు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.