తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కన్నప్ప కథను సంపూర్ణంగా చెప్పేస్తోంది. ఈ పోస్టర్ పాత్రలోని ధైర్యం, క్యారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసేలా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.