ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని ఈ అత్తమ్మ కిచెన్ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా “అత్తమ్మ కిచెన్”ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా “అత్తమ్మ కిచెన్” నిలుస్తుంది.