Samsung Galaxy F15 India launch : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త గ్యాడ్జెట్‌ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది సామ్సంగ్ సంస్థ. దాని పేరు సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్ లైవ్ అయ్యింది. త్వరలోనే ఈ మోడల్ లాంచ్ అవుతుందని ఆ టీజర్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..