ప్రతీ ఏడాది కార్తీక మాసం రాత్రి వేళ మాత్రమే తలుపులు తెరుచుకునే రహస్యమైన ఊరుగా భైరవకోన ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యంగా ఉంటుంది. అయితే, ఓ దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో బసవ లింగం (సందీప్ కిషన్), జాన్ (వైవా హర్ష), గీత (కావ్య).. భైరవకోనలోకి వెళతారు. మరి వారు బయటికి వచ్చారా? భైరవకోన రహస్యమేంటి? గరుడ పురాణంతో సంబంధం ఏంటి? అనే అంశాలు ఊరు పేరు భైరవకోన చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఫ్యాంటసీ, సస్పెన్స్, హారర్‌తో పాటు ఈ చిత్రంలో కామెడీ కూడా ఉండడం ప్లస్ పాయింట్‍గా ఉంది. అయితే, వీఎఫ్‍ఎక్స్ కాస్త మెరుగ్గా ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.