Rava Paratha: పరోటా అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదా, గోధుమ పిండితో చేసేవే. కేవలం మైదా, గోధుమపిండి మాత్రమే కాదు ఉప్మా రవ్వతో కూడా మెత్తని పరోటాలు చేసుకోవచ్చు. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. నెయ్యితో కాలిస్తే చాలా రుచిగా ఉంటాయి. మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీగా రవ్వ పరోటా అని చెప్పుకోవచ్చు. పిల్లలకి ఇది చాలా నచ్చుతుంది. ఇది మెత్తగా ఉంటాయి, కనుక పెద్దగా నమలాల్సిన అవసరం లేదు. కాబట్టి పిల్లలు సులువుగానే తినేస్తారు. ఒక్కసారి పిల్లలకు వీటిని పెట్టి చూడండి. ఈ ఉప్మా రవ్వ పరోటా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.