Home క్రికెట్ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా జైస్వాల్.. సిక్స్‌లలోనూ రికార్డులు-yashasvi jaiswal becomes first...

ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా జైస్వాల్.. సిక్స్‌లలోనూ రికార్డులు-yashasvi jaiswal becomes first indian to score two double centuries against england and he breaks sixes record also ,cricket న్యూస్

0

ఈ ఫీట్ సాధించిన తొలి భారత ప్లేయర్

ఇంగ్లండ్‍తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‍లో రెండు డబుల్ సెంచరీలతో జైస్వాల్ సత్తాచాటాడు. దీంతో.. టెస్టుల్లో ఇంగ్లండ్‍పై రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ, గుండప్ప విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్, చతేశ్వర్ పూజారా, మన్సూర్ అలీఖాన్.. టెస్టుల్లో ఇంగ్లండ్‍పై చెరో డబుల్ సెంచరీ చేశారు. అయితే, జైస్వాల్ ఇప్పుడు ఇంగ్లిష్ జట్టుపై రెండో ద్విశతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్‍పై రెండు ద్విశతకాలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు.

Exit mobile version