Home ఎంటర్టైన్మెంట్ వాళ్ల వలనే మా అమ్మ చనిపోయింది..54 రోజులు చిరంజీవి ఫోన్ చేసాడు 

వాళ్ల వలనే మా అమ్మ చనిపోయింది..54 రోజులు చిరంజీవి ఫోన్ చేసాడు 

0

తెలుగు వాళ్ళకి పరిచయం అక్కర్లేని పేరు శుభలేఖ సుధాకర్. 1982 లో వచ్చిన శుభలేఖ సినిమా ద్వారా నటుడుగా  తెలుగు తెరకు పరిచయమయ్యి ఆ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. నలభయ్యేళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో అధ్బుతమైన క్యారక్టర్ లని పోషించాడు.నేటికీ సినిమాలు చేస్తు తన నటనతో అలరిస్తు వస్తున్నాడు. కామెడీ ని సీరియస్ ని ఏక కాలంలో పండించగలడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

కొన్ని యుట్యూబ్ చానెల్స్ గతంలో శుభలేఖ సుధాకర్ ఆయన భార్య శైలజ విడిపోయారని కొన్ని వీడియోలని పెట్టారు.వాటిని చూసిన సుధాకర్ అమ్మ శైలజ ని సుధాకర్ ని తన ఇంటికి పిలిపించుకుని వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయేమో అని అడిగింది.ఆమె అలా అడిగే సరికి ఆశ్చర్యపోయిన సుధాకర్ గొడవలు ఏమి లేవని  చెప్పాడు. ఆ తర్వాత రోజు ఆమె చనిపోయింది. యు ట్యూబ్ లో నేను శైలజ విడిపోయామనే వార్తలు చూసి మా అమ్మ ఎంతో మానసిక క్షోభ అనుభవించి ఉంటుందని అందుకే అమ్మ చనిపోయిందని చెప్పాడు.  ఇప్పుడు ఈ విషయాన్ని శుభలేఖ సుధాకర్ చెప్పడంతో ఆయన మాటలు విన్న వారు  చాలా భాధ పడుతున్నారు. 

ఈ సంధర్భంగా అలాంటి వార్తలు రాసే వాళ్లపై చాలా ఘాటుగానే స్పందించాడు.వ్యూయర్స్ కోసం డబ్బు కోసం కక్కుర్తి పడి   వార్తలు రాసే వాళ్ళు వ్యభిచారం చేసుకొని బతికే వాళ్ల కంటే దారుణం అని చెప్పుకొచ్చాడు. ఇలాగే ఒకసారి చిరంజీవి నాకు మధ్య గొడవలు ఉన్నాయని రాసారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చిరంజీవి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. బాలసుబ్రమణ్యం గారు అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నప్పుడు 54 రోజుల పాటు నిత్యం చిరంజీవి నాకు  ఫోన్ చేసి అయన యోగ క్షేమాలని కనుక్కునే వారు అని కూడా  చెప్పాడు.

Exit mobile version