కొనసాగుతున్న ఐపీఓ సీజన్
వచ్చే వారంలో వరుస ఐపీఓ (IPO)లు, లిస్టింగ్స్ అందుబాటులోకి రానుండగా, ఏడాది పొడవునా ఐపీవో మార్కెట్ యాక్టివ్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జునిపెర్ హోటల్స్, జీపీటీ హెల్త్ కేర్, జెనిత్ డ్రగ్స్, డీమ్ రోల్ టెక్ అనే నాలుగు ఐపీఓలను ఈ వారంలో లాంచ్ చేయనున్నారు. అలాగే, ఈ వారం, రెండు ప్రధాన ఐపీఓలు – విభోర్ స్టీల్ ట్యూబ్స్ (VIBHOR), ఎంటరో హెల్త్ కేర్ సొల్యూషన్స్ స్టాక్ మార్కెట్లో బలమైన జీఎంపీతో ప్రారంభమయ్యాయి. ఇవి మార్కెట్ నుంచి రూ .1,672 కోట్లను సమీకరించనున్నాయి.