Home ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్‌పై మరోసారి ఆరోపణలు చేసిన రాధిక.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు! 

టాలీవుడ్‌పై మరోసారి ఆరోపణలు చేసిన రాధిక.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు! 

0

సొసైటీలో మంచి, చెడు కలిసి ఉన్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కలిసి పనిచేస్తుంటారు. అయితే కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం ఎవరూ చేయని ఆరోపణలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిలో హీరోయిన్‌ రాధికా ఆప్టే ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, దాన్ని బేస్‌ చేసుకొని ఎదుటివారిపైన రకరకాల ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఆమధ్య తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని కామెంట్లు చేసింది రాధిక. ఒక సీనియర్‌ హీరో వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఆరోపించింది. అప్పట్లో దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్లీ టాలీవుడ్‌ని టార్గెట్‌ చేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. టాలీవుడ్‌ రోజురోజుకీ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. దీన్ని ఓర్వలేని ఇతర సినీ పరిశ్రమలకు చెందిన కొందరు రాధిక వీడియోను అందరికీ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. రాధికా ఆప్టే తెలుగులో నటించిన సినిమాలు రక్త చరిత్ర1, రక్తచరిత్ర2, ధోనీ, లెజెండ్‌, లయన్‌. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదామె. 

ఇంతకీ రాధికా ఆప్టే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశాలేమిటో చూద్దాం. ‘నేను ఎక్కువ కష్టపడిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీయే. ఇక్కడ హీరోల డామినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. మహిళలను ట్రీట్‌ చేసే విధానం అస్సలు బాగోదు. హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యం హీరోయిన్లకు ఇవ్వరు. అంతేకాదు, హీరోలకు అనుగుణంగా యూనిట్‌ సభ్యులు నడుచుకుంటారు. అతని మూడ్‌ని బట్టే అన్నీ చేస్తారు. ఇక్కడ నేను చేసిన సినిమాలు తక్కువే అయినా చాలా విషయాల్లో చాలా బాధపడ్డాను. అందుకే తెలుగులో నేను సినిమాలు చేయడం లేదు’  అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

టాలీవుడ్‌పై ఆమె చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై తెలుగు సినిమా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది టాలీవుడ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి టాప్‌ పొజిషన్‌కి వెళ్ళారు. వాళ్ళెవరికీ లేని సమస్య రాధికకే ఎందుకు వస్తుంది. ఆమెకు పబ్లిసిటీ కావాలి. దాని కోసం ఏం చెయ్యడానికైనా, ఎలాంటి ఆరోపణలు చేయడానికైనా సిద్ధపడుతుంది అంటూ ఆమెను ఉద్దేశించి రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. టాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాల్ని మాత్రమే చెప్పింది. అందులో తప్పేముంది అని ఆమెను సపోర్ట్‌ చేస్తూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. 

Exit mobile version