Home ఎంటర్టైన్మెంట్ ఆ హీరో మీద ఇష్టంతోనే ఐటెం సాంగ్ చేశా.. ఇక చెయ్యను 

ఆ హీరో మీద ఇష్టంతోనే ఐటెం సాంగ్ చేశా.. ఇక చెయ్యను 

0

2003 లోనే చిత్ర రంగ ప్రవేశం చేసి కెరీర్ తొలినాళ్లలోనే జాతీయ ఉత్తమనటిగా అవార్డుని పొందిన నటి ప్రియమణి.  నేటికీ పాన్ ఇండియా సినిమాలు చేస్తు తన అందంతో అంతకంటే అందమైన అభినయంతో జాతీయ లెవల్లో తన సత్తా చాటుతుంది.ఆమె ఇంతవరకు  తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషల్లో కలిపి సుమారు 65 చిత్రాలకి పైగానే చేసింది.  తాజాగా ఆమె టాక్ అఫ్ ది డే గా నిలిచింది

ప్రియమణి ప్రస్తుతం ఆర్టికల్ 370  అనే మూవీలో చేస్తుంది. ఈ సంధర్భంగా ఇండియా టుడే కి ఇచ్చిన  ఇంటర్వ్యూ లో  తన నట జీవితంలోనే చేసిన ఏకైక ఐటెం సాంగ్ గురించి ప్రస్తావనికి వచ్చింది. అప్పుడు ప్రియమణి మాట్లాడుతు  షారుక్ అంటే తనకి చాలా ఇష్టమని ఎలాగైనా షారుక్ పక్కన నటించాలనే ఉద్దేశంతోనే  ఐటెం సాంగ్ ని చేసానని చెప్పింది. ఆ  తర్వాత చాలా మంది ఫిలిం మేకర్స్  ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా ఐటెం సాంగ్స్ చెయ్యలేదని చెప్పుకొచ్చింది.  సోషల్ మీడియా ద్వారా ప్రియమణి మాటలు విన్న వాళ్ళందరూ ఆమె పట్టుదలని మెచ్చుకుంటున్నారు.

అలాగే షారుక్ ని  కొంత మంది చెడ్డవాడని అనుకుంటారని కానీ ఆయన చాలా మంచి వాడని  చెప్పింది.అలాగే ఆడవాళ్ళకి చాలా గౌరవాన్ని కూడా ఇస్తాడని  చెప్పుకొచ్చింది. ఇక ప్రియమణి చేసిన ఏకైక ఐటెం సాంగ్  చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలోనిది.  2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ మంచి విజయాన్ని అందుకుంది. అందులోని 1234 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్  అనే ఐటెం సాంగ్ కి ప్రియమణి చేసిన డాన్స్ కి ఇండియా మొత్తం ఫిదా అయ్యింది. ఈ మధ్యనే వచ్చిన షారుక్  జవాన్ లో కూడా ప్రియమణి నటించింది.ఆమె చేసిన క్యారక్టర్ కి మంచి పేరు కూడా  వచ్చింది.

 

Exit mobile version