Home చిత్రాలు Akshay Kumar : అబుదాబీలోని మొదటి హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్.. జన్మ ధన్యమంటూ

Akshay Kumar : అబుదాబీలోని మొదటి హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్.. జన్మ ధన్యమంటూ

0

అబుదాబిలో ( Abu Dhabi )అద్భుతంగా మొదటి హిందూ దేవాలయం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) ఈ హిందూ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది.

అయితే ఈ దేవాలయం ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన నరేంద్ర మోడీతో పాటు పలువురు ఇండియన్ సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు.అందులో కాస్త సినిమా గ్లామర కూడా ఈ కార్యక్రమానికి తోడయ్యింది.

బాలీవుడ్ నుంచి కొంత మంది తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.అందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్( Akshay Kumar ) కూడా ఉన్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్‌ అక్షయ్ కుమార్‌ ఈ అద్భుత ఘట్టంలో పాలు పంచుకున్నారు.అయితే ముస్లీమ్ దేశంలో సర్వమత సమ్మేళనంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( United Arab Emirates )రాజధాని అబుదాబిలో తొలిసారిగా హిందూ దేవాలయాన్ని( A Hindu temple ) నిర్మించడం పట్ల అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.అబుదాబిలోని స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు జన్మ ధన్యం అయ్యింది.ఎంతో సంతోషంగా ఉంది అంటూ అబుదాబి హిందూ ఆలయ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అక్షయ్‌.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ పోస్టుపై అభిమానులు నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకే విధంగా స్పందిస్తున్నారు.ఇకపోతే అక్షయ్ కుమార్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అక్షయ్ కుమార్.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

Exit mobile version