Home ఆంధ్రప్రదేశ్ ఎన్డీయేలోకి కొత్త మిత్రులు, ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు-delhi news in telugu...

ఎన్డీయేలోకి కొత్త మిత్రులు, ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు-delhi news in telugu amit shah says new friends joins nda key comments on tdp alliance ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

ఎన్డీయేలోకి టీడీపీ?

ఇటీవల అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలపై పెదవి విప్పని బీజేపీ వర్గాలు చర్చల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు, సమాచారం ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ నుంచి వచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. చర్చలపై మాట్లాడేందుకు బీజేపీ నాయకులు ఏమాత్రం ఇష్టపడలేదు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్‌ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version