ఎన్టీఆర్ జిల్లాలో కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. ఈ విషయం మూడు రోజులు గడిచిన ఎవరికీ తెలియలేదు. చివరికి అటుగా వెళ్తున్న వారు చూసి, ఆ వ్యక్తిని గమనించారు. వెంటనే రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన వలస కూలిగా ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.