Home వీడియోస్ Karimnagar: కార్యకర్తలకు గుర్తింపు లేదు.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది

Karimnagar: కార్యకర్తలకు గుర్తింపు లేదు.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది

0

కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప చేసిందేమి లేదని వాపోయారు. గెలిచిన తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర ఆగ్రహం చెందారు. అందువల్లే 2023 సార్వత్రి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని వాపోయారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. అలా మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని కూర్చోపెట్టేందుకు పలువురు ప్రయత్నించారు. మరికొందరు మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సభలో మాజీ ఎంపీ వినోద్ కుమార్​తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.

Exit mobile version