Home వీడియోస్ Andhra Pradesh | ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జి

Andhra Pradesh | ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జి

0

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ‘చలో అసెం బ్లీ’కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రాంగణ గేట్ల వద్ద పోలీసులకు-సర్పంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పలువురు సర్పంచులని లాక్కెళ్లి పోలీసులు బస్సుని ఎక్కించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version