Home ఆంధ్రప్రదేశ్ 60 ఏళ్ల కష్టం హైదరాబాద్, ఏటా రూ. 13 వేల కోట్ల ఆదాయానికి గండి- సీఎం...

60 ఏళ్ల కష్టం హైదరాబాద్, ఏటా రూ. 13 వేల కోట్ల ఆదాయానికి గండి- సీఎం జగన్-amaravati news in telugu ap assembly session cm jagan criticizes chandrababu cause of state economic situation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

97 శాతం హామీలు నెరవేర్చాం

చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి కూడా ప్రజల ఖాతాల్లోకి వెళ్లిందా? అని సీఎం జగన్ అన్నారు. అదే రాష్ట్రం అదే బడ్జెట్‌ అయితే వైసీపీ హయాంలో ఎంతో మందికి లబ్ది చేరుకూరిందన్నారు. అయితే చంద్రబాబు టైంలో డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో అన్ని వర్గాల సంక్షేమం కోసం అడుగులు ముందుకేశామన్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోయినా, చంద్రబాబు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో పనిచేశామన్నారు. మేనిఫెస్టోలో 97 శాతం హామీలను నెరవేర్చామన్నారు. జాతీయ పార్టీతో, ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో పొత్తులు పెట్టుకుని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తే రెవెన్యూ లోటు ఎందుకు ఉందని సీఎం జగన్ ప్రశ్నించారు.

Exit mobile version