Masala Egg rice: నోరు చప్పగా ఉన్నప్పుడు ఏదైనా ఘాటుగా తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు మసాలా ఎగ్ రైస్ చేసుకుంటే బాగుంటుంది. లేదా అన్నం మిగిలిపోయిన సందర్భంలో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ మసాలా ఎగ్ రైస్ రెసిపీ చాలా సులువు. ఇంట్లో వండిన అన్నం ఉంటే చాలు. పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ కోసం, డిన్నర్ కోసం కూడా ఇది మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. మసాలా ఎగ్ రైస్ రెసిపీ ఎలాగో చూద్దాం.