Home ఎంటర్టైన్మెంట్ హనుమాన్ హిందీ తొలి రోజు కలెక్షన్స్ ఇవే

హనుమాన్ హిందీ తొలి రోజు కలెక్షన్స్ ఇవే

0

తేజ సజ్జ (teja sajja)హీరోగా ప్రశాంత్ వర్మ(prasanth varma)దర్శకత్వంలో వచ్చిన మూవీ హనుమాన్ (hanuman) నిన్న రిలీజ్ అయిన హనుమాన్ అన్ని చోట్ల    హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా మూవీ చూసిన ప్రతి ఒక్కరు హనుమాన్ టీం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా తెలుగు తో పాటు నార్త్ లో కూడా రిలీజ్ అయిన హనుమాన్ కి సంబంధించిన తాజా న్యూస్ హనుమాన్ కి ఉన్న శక్తిని చాటి చెప్తుంది.   

హనుమాన్ నార్త్ లో మొదటిరోజు 2.15 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది. దాంతో పాటు హిందీలో ఇటీవల విడుదలైన  తెలుగు చిత్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా కూడా హనుమాన్ నిలిచింది. ఎలాగు మూవీకి పాజిటివ్ టాక్ ఉండటంతో కలెక్షన్లు  మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగు నాట ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షో లు   వేసినప్పుడే చాలా మంది హను మాన్ నార్త్ లో రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ మాటలు  నిజమయ్యి ఎలాంటి స్టార్ కాస్ట్ గాని ప్రమోషన్స్ గాని లేక పోయినా కూడా హనుమాన్ రికార్డు కలెక్షన్స్ దిశగా పయనిస్తోంది.

 హనుమాన్ ని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించగా తేజ సరసన అమృత అయ్యర్ (amritha aiyer) హీరోయిన్ గా నటించింది. విలన్ పాత్రలో వినయ్ రాయ్ ( vinay rai) తేజ అక్కగా  వరలక్ష్మి శరత్ కుమార్(varalaxmi sarathkumar) లు సూపర్ గా నటించి సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

 

Exit mobile version