Home ఎంటర్టైన్మెంట్ హనుమాన్ మూవీ ప్రీమియర్ కలెక్షన్ల నుంచి ఆయోధ్య రామమందిరానికి విరాళం.. ఎంతంటే!-hanuman movie team donates...

హనుమాన్ మూవీ ప్రీమియర్ కలెక్షన్ల నుంచి ఆయోధ్య రామమందిరానికి విరాళం.. ఎంతంటే!-hanuman movie team donates to ayodhya ram mandir from paid premier collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

హనుమాన్ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్ల నుంచి అయోధ్య రామమందిరానికి తొలి విడత విరాళం ఇచ్చింది మూవీ టీమ్. ఇప్పటి వరకు అమ్ముడైన ప్రతీ టికెట్‍పై 5 రూపాయాల చొప్పున అందించింది. ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లలో రూ.14,85,810 లక్షల చెక్‍ను అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్రానికి మూవీ టీమ్ పంపింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, అమృత అయ్యర్ ఈ చెక్‍ నమూనాతో ఉన్న ఫొటోన మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్లలో 2,97,162 టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

Exit mobile version