Home ఎంటర్టైన్మెంట్ అనన్య కోసం రంగంలోకి దిగిన పాయల్, అనసూయ!

అనన్య కోసం రంగంలోకి దిగిన పాయల్, అనసూయ!

0

అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘తంత్ర’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్, అనసూయ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. “గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. మా ప్రొడ్యూసర్స్ నరేష్ బాబు, రవిచైతన్య ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ చాలా బాగా సహకరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది. ఎంతో బిజీగా ఉన్నా కూడా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్ గారికి, అనసూయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.” అన్నారు.

ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ.. “ఫస్ట్ లుక్, టీజర్‌కి వచ్చిన ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా తంత్ర సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్, అనసూయ గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.

ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డీఓపీలుగా సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల, ఆర్ట్ డైరెక్టర్ గా గురుమురళీ కృష్ణ, ఎడిటర్ గా ఎస్ బి ఉద్ధవ్ వ్యవహరిస్తున్నారు.

Exit mobile version