Home ఎంటర్టైన్మెంట్ ప్రశాంత్ వర్మ ఇంత రొటీన్ స్టోరీ రాశాడేంటి?

ప్రశాంత్ వర్మ ఇంత రొటీన్ స్టోరీ రాశాడేంటి?

0

‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వం వచ్చిన తాజా చిత్రం ‘హ‌నుమాన్’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అయితే ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతరుల సినిమాలకు కథలు అందిస్తున్నాడు ప్రశాంత్. గతంలో ‘అద్భుతం’ అనే చిత్రానికి కథ అందించాడు. అలాగే ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమాకి కూడా కథ అందించాడు. అయితే ఈ స్టోరీ రొటీన్ గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. “నీ బిడ్డకి మరణ గండం.. లేదా అతని చేతిలో వేరొకరికి మరణం” అంటూ మహాభారతంలోని కృష్ణుడు-కంసుడు రిఫరెన్స్ తో టీజర్ ని రూపొందించారు. శ్రీ కృష్ణుడి రిఫరెన్స్ ఉందనే గానీ, టీజర్ చాలా రొటీన్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ఓ వైపు దర్శకుడిగా విభిన్న సినిమాలు అందించడానికి ట్రై చేస్తూ, మరోవైపు రచయితగా మాత్రం ఒక యంగ్ హీరోకి ఇంత రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అందించడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా నిజంగానే రొటీన్ గా ఉంటుందా లేక ఏదైనా కొత్తదనం ఉందా అనేది ట్రైలర్ లేదా సినిమా విడుదలైతే క్లారిటీ వచ్చే అవకాశముంది.

Exit mobile version