Home ఎంటర్టైన్మెంట్ కథ డిమాండ్‌ చేసింది… పదేళ్ళు షూటింగ్‌ చేశారు!

కథ డిమాండ్‌ చేసింది… పదేళ్ళు షూటింగ్‌ చేశారు!

0

ఒక సినిమా పదేళ్ళపాటు షూటింగ్‌ జరుపుకొని త్వరలో విడుదల కాబోతోంది. ఇది విన్న వారికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ, ఇది నిజం. ఆనందం చిత్రంతో హీరోగా పరిచయమైన ఆకాష్‌ ఆ తర్వాత పిలిస్తే పలుకుతా, నవవసంతం వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆకాష్‌, ఆ తర్వాత తన పేరును జై ఆకాష్‌గా మార్చుకొని తన కెరీర్‌ను కొనసాగించాడు. ఒకవిధంగా చెప్పాలంటే అతనికి రావాల్సినంత పాపులారిటీ రాలేదనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఆకాశ్‌ ఎ క్యూబ్‌ మూవీస్‌ అనే యాప్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా తను నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలను కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల ఆకాశ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన జై విజయం చిత్రాన్ని తన క్యూబ్‌ మూవీస్‌లో విడుదల చేసాడు. మంచి ఆదరణ లభిస్తుండడంతో ఇప్పుడు థియేటర్లలో కూడా రిలీజ్‌ చేశారు.

ఇదిలా ఉంటే జైఆకాష్‌కి సంబంధించిన న్యూస్‌ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. 2012లో ప్రారంభించిన ఓ సినిమా ఈ సంవత్సరం రిలీజ్‌ కాబోతోంది. ‘మామరం’ పేరుతో రూపొందిన ఈ సినిమాలో ఆకాశ్‌ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, కాదల్‌ సుకుమార్‌, రాహుల్‌దేవ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. కథ డిమాండ్‌ మేరకు హీరో ఆకాశ్‌ రకరకాల ఏజ్‌ గెటప్స్‌లో కనిపించాల్సి ఉంటుంది. సహజంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని 10 ఏళ్లపాటు షూటింగ్‌ చేసామని చెబుతున్నాడు ఆకాష్‌. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Exit mobile version