Onion Powder: ఉరుకులు పరుగులు పెట్టే జీవన విధానంలో అన్ని ఇన్స్టాంట్గా ఉండే వంటకాలే కావాలనిపిస్తుంది. ఏ కూర వండాలన్నా ఉల్లిపాయను కచ్చితంగా కోయాల్సిందే. ప్రతిరోజూ ఉల్లిపాయ కోయడం కష్టం అనుకున్నవారు… ఒకసారి ఉల్లిపాయ పొడిని రెడీ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దానితో పులుసులు, ఇగురు కూరలు వండేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.