Home ఆంధ్రప్రదేశ్ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తా, మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ హల్చల్!-vijayawada news in...

జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తా, మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ హల్చల్!-vijayawada news in telugu ka paul creating nuisance at tadepalli cm camp office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

షర్మిలపై విమర్శలు

కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ…కీలక నేతలపై తరచూ విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తూ… వార్తల్లో నిలుస్తుంటారు. కేఏ పాల్ ఏం మాట్లాడిన తెగ వైరల్ అవుతుంది. ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయంపై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చాలా పెద్ద తప్పుచేశారన్నారు. ఆస్తులు, పదవి కోసం కాంగ్రెస్ కు షర్మిల తన పార్టీని అమ్మేశారన్నారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజారెడ్డి, వైఎస్ఆర్ ఆత్మలతో తాను కమ్యూనికేట్ చేస్తున్నారన్నారు. వారు బతికి ఉంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని అడ్డుకునేవారన్నారు. సీఎం జగన్‌ను తిట్టడం, ఏపీని నాశనం చేయడం షర్మిల పని అంటూ కేఏ పాల్ విమర్శించారు.

Exit mobile version