Home ఎంటర్టైన్మెంట్ చిరంజీవి,చరణ్ ల మూవీ డైరెక్ట్ గా యుట్యూబ్ లోనే

చిరంజీవి,చరణ్ ల మూవీ డైరెక్ట్ గా యుట్యూబ్ లోనే

0

మెగాస్టార్ చిరంజీవి( chiranjeevi) అండ్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( ram charan) కలయికలో 2022 ఏప్రిల్ 29 న విడుదల అయిన మూవీ ఆచార్య. తొలిసారి చిరంజీవి,చరణ్ లు పూర్తి నిడివితో కనిపించిన ఆచార్య మీద  మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ మూవీ  బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని మూట గట్టుకుంది. తాజాగా ఆచార్యకి  సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ తో మెగా ఫ్యాన్స్   

 ఆచార్య మూవీ హిందీ వెర్షన్ లో రిలీజ్ అవుతుంది. ఈ జనవరి 11న ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ కి చెందిన     యూట్యూబ్ ఛానెల్లో హిందీ వెర్షన్ లో  రిలీజ్ అవుతుంది. ఈ మేరకు పెన్ సంస్థ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది.అసలు  ఆచార్య రిలీజ్  టైంలోనే  తెలుగుతో పాటు హిందీ లో కూడా  రిలీజ్ చేస్తామనే ప్రకటన  చిత్ర బృందం నుంచి వచ్చింది. కానీ  ఆ విషయం కార్యరూపం దాల్చలేదు. ఇన్ని సంవత్సరాలకి   డైరెక్ట్ గా యు ట్యూబ్ లో రిలీజ్ అవుతుంది.



   

కొరటాల శివ (koratala siva)దర్శకత్వంలో వచ్చిన ఆచార్య లో చిరంజీవి, చరణ్ లతో పాటు  పూజ హెగ్డే,సోను సూద్, అజయ్, తనికెళ్ళ భరణి తదితరులు  ముఖ్య పాత్రల్లో నటించగా మణి శర్మ సంగీతాన్ని అందించాడు.140 కోట్ల బడ్జట్ తో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు  ఆచార్య ని  రూపొందించారు.

 

Exit mobile version