ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ సీరియస్ గా స్పందించింది. ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది వరకే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఆ దేశ మంత్రుల వ్యాఖ్యలతో మరింత అగ్గికి ఆజ్యం పోషినట్లు అయింది. అయితే ఈ గొడవలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.