Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో మరో సమ్మె సైరన్- 108, 104 సిబ్బంది స్ట్రైక్ నోటీసులు-amaravati news in telugu...

ఏపీలో మరో సమ్మె సైరన్- 108, 104 సిబ్బంది స్ట్రైక్ నోటీసులు-amaravati news in telugu 108 104 employees strike notices to ap govt on salaries hike ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

మున్సిపల్ కార్మికుల సమ్మె

మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతన నినాదంతో కార్మికులు సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. వేతన పెంపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడతామని, హెల్త్ అలెవెన్స్ హామీలను నెరవేరుస్తామని మంత్రుల కమిటీ స్పష్టంచేస్తుంది. అయితే వేతనాలు పెంచితేనే విధుల్లో చేరతామని కార్మికులు అంటున్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే కార్మికుల డిమాండ్లు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. సమ్మె కాల్ ఆఫ్ చేస్తే డిమాండ్లపై నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పెంపు అంతా వచ్చే ప్రభుత్వంలోనే ఇస్తామని కార్మిక సంఘాలకు మంత్రుల, అధికారుల కమిటీ తేల్చి చెప్పింది. అన్ని కేటగిరీల కార్మికులకు హెల్త్ అలవెన్సులు అనే పేరు లేకుండా మొత్తం వేతనంగానే చెల్లింపులు చేస్తామన్నారు. హెల్త్ అలవెన్సులు రూ.6 వేలు అందులోనే కలిపి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎక్స్ గ్రేషీయాను కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇస్తామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు పరిహారం రూ.7 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు కోరాయని, దానికి ప్రభుత్వం అంగీకరించిందని మంత్రులు, అధికారుల కమిటీ తెలిపింది.

Exit mobile version