ఇదిలా ఉంటే, నాగార్జునకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలకు కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అయితే, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నాగార్జున ఈ మధ్యకాలంలో ప్లాప్స్ అందుకుని వెనుకబడ్డారు. నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయడం లేదు. బిగ్ బాస్ 7 తెలుగుకు హోస్ట్‌గా చేయడానికి ముందు ఘోస్ట్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా సరైనా హిట్ లేకుండా సతమతం అవుతున్న నాగార్జున నా సామిరంగ సినిమాపైనా గంపెడు ఆశలు పెట్టుకున్నారు.