Gavaskar on KL Rahul: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ తొలి రోజే అక్కడి బౌన్సీ పిచ్‌లు పరీక్ష పెట్టిన వేళ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచి టీమ్ స్కోరును 200 దాటించాడు. దీంతో మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదీ రాహుల్ అసలు సత్తా అని ఆకాశానికెత్తారు.