Home వీడియోస్ TSRTC Request : ఆ బస్సులను ఎక్కువగా వాడుకోండి – మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ...

TSRTC Request : ఆ బస్సులను ఎక్కువగా వాడుకోండి – మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

0

TSRTC On MahaLakshmi Scheme: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ వీడియోను విడుదల చేశారు. “ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి… సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది” అని చెప్పారు.

Exit mobile version