Home Uncategorized Guppedantha Manasu December 20th Episode: వసు చేతికి రిషి బ్రాస్‌లెట్, విశ్వరూపం చూపించబోతున్న శైలేంద్ర
Guppedantha Manasu December 20th Episode: వసు చేతికి రిషి బ్రాస్‌లెట్, విశ్వరూపం చూపించబోతున్న శైలేంద్ర
0
Guppedantha Manasu December 20th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 20 ఎపిసోడ్)
ఎండీసీటులో కూర్చుందామని వెళ్లిన శైలేంద్రకి షాక్ ఇస్తుంది వసుధార. ప్యూన్ ని పిలిచి శైలేంద్ర వాళ్ళని మెడ పట్టుకుని బయటకి గెంటేయమని చెప్తుంది.  శైలేంద్ర వాడిని ఆపి మమ్మీ వెళ్లిపోదాం పద అంటాడు. ఇంకోసారి క్యాబిన్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని అనడంతో పాటూ ఈ సీటుని శానిటైజర్ తో క్లీన్ చెయ్యి అడ్డమైన వైరస్ లు వస్తున్నాయని ప్యూన్ కి చెప్తుంది. అది విని దేవయాని కోపంగా వెళ్లబోతుంటే ఇక్కడ వసుధారకి పట్టు ఉందని చెప్పి అక్కడి నుంచి తీసుకెళతాడు శైలేంద్ర.
మహేంద్ర-అనుపమ
మహేంద్ర, అనుపమ కాలేజ్ లో ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర డల్ గా ఉండటం చూసి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది.
మహేంద్ర: జగతి నేను ఇక్కడే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. తను ఎప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్ గురించే ఆలోచించేది. డీబీఎస్టీ కాలేజ్ ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మంచి భార్యగా, కాలేజీలో మంచి లెక్చరర్ గా ఉండేది. అంత గొప్ప బంధం ఉంది కాబట్టి తనని ఇంకా మర్చిపోలేకపోతున్నాను
అనుపమ: జగతితో ఉన్న స్నేహమే నాకు ఈ కాలేజ్ తో స్నేహం ఏర్పడింది. ఎవరికి అడిగినా అందరూ జగతి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఆ సంతోషానికి మించి దుఖం ఉంది. ఇన్ని రోజులు జగతి లేదు తన చావుకి కారణం ఎవరు కనుక్కుందామని అనుకున్నా. కానీ ఇప్పుడు రిషి కనిపించకుండా పోయాడు. నాకు రిషి కొన్ని రోజులే పరిచయం కానీ నేనే చాలా ఎమోషనల్ గా ఉన్నాను. అలాంటిది వసుధార ఎంత బాధపడుతుందో అర్థం అవుతుంది. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే వసు రిషి విషయంలో మాత్రం ఎండుటాకులా వణికిపోతుంది. ఏదో ఒకటి చేయాలని అనుపమ అంటుంది.
మహేంద్ర: వసు బాధని దూరం చేయాలనే కదా ముకుల్ తో మాట్లాడాను. వాళ్ళ ప్రేమే వాళ్ళని దగ్గర చేస్తుంది
దేవయాని వసుధార చేసిన అవమానం తలుచుకుని ఏడుస్తుంది.
దేవయాని: అది నిన్ను అన్ని మాటలు అంటుందా. జగతి కూడా ధైర్యంగా ఎప్పుడు నిన్ను అన్ని మాటలు అనలేదు. కనీసం అలాంటి సాహసం కూడ చేయలేదు. కానీ ఇది మనల్ని చూస్తేనే ఒంటి కాలి మీద లేస్తుంది. మనల్ని వైరస్ అంటుందా
శైలేంద్ర : వసు అంతకంతకు భయపడేలా చేస్తాను.
దేవయాని: రిషి కనిపించకపోయినా భయపడటం లేదు. మనల్ని చూసి అది కాస్త కూడా తొణకడం లేదు
శైలేంద్ర: అటెండర్ మనల్ని మెడ పట్టుకుని గెంటేస్తే ఏం బాగుంటుంది.
దేవయాని: చివరికి అటెండర్ కి కూడా భయపడుతున్నావా
శైలేంద్ర: చూస్తూ ఉండు వసుని మెడపట్టుకుని బయటకి గెంటించేస్తాను
ఆ మాటలు విన్న ధరణి ఏంటి మీరు అంటుందని గదిలోకి వస్తుంది.
ధరణి:  మిమ్మల్ని మెడ పట్టుకుని బయటకి గెంటేశారా? ఎంత పని జరిగింది. ఫైల్స్ మీద సంతకం పెట్టాలని అన్నారు కదా. ఏంటి అత్తయ్య మిమ్మల్ని కూడా మెడ పట్టుకుని బయటకి గెంటేశారా? నేను చెప్తే విన్నారా? నేను వెళ్లినట్టయితే ఇలా జరిగేది కాదు కదా
శైలేంద్ర: మేం మాట్లాడుకున్నది మొత్తం విన్నావా
ధరణి: అవును విన్నాను
దేవయాని: వసుధార చేసిన అవమానం కంటే ఈ ధరణి చేసిన అవమానం తట్టుకోలేకపోతున్నాను
శైలేంద్ర: ఇప్పుడు నేను వేసే అడుగు చాలా భయంకరంగా ఉండబోతుంది. నీ కళ్ల ముందు ఏం జరిగినా నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు. వసుధార నోరు మూయిస్తాను. నేను చెప్పే మాటలు వసు నోటి నుంచి అందరి ముందు పలికేలా చేస్తానంటూనే.. రిషి నిన్ను వదలను.. ఆ వసుధారని నిన్ను అడ్డు తప్పిస్తానని మనసులో అనుకుంటాడు.
రిషి సర్ ఎప్పుడు వస్తారు, నిజంగా శైలేంద్ర దగ్గరే ఉన్నాడా అని వసు మహేంద్రతో అంటుంది. త్వరలోనే రిషి వస్తాడని మహేంద్ర తనకి ధైర్యం చెప్తాడు.
మరోవైపు కాలేజ్ లో బోర్డ్ మీటింగ్ ప్రారభంమవుతుంది. దేవయాని రావడంతో అందరూ తనకి గుడ్ మార్నింగ్ చెప్తారు
ఫణీంద్ర: ఎందుకు వచ్చావు.  నిన్ను ఎవరూ పిలవలేదు కదా
దేవయాని: పెద్ద మీటింగ్ జరుగుతుందని తెలిసి వచ్చాను.
ఫణీంద్ర: ఇంట్లో చేస్తోంది చాలక కాలేజ్ లో కూడా నా మనసు పాడు చేయడానికి వచ్చావా
దేవయాని: వసుధార ఇంకా రాలేదా
బోర్డ్ మెంబర్స్ టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది, వసుధార అసలు ఎక్కడ ఉంది, తను వస్తుందా రాదా అని అడుగుతుంటారు
వసు చేతికి రిషి బ్రేస్ లేట్
వదిన గారు మీరు కంగారుపడకండి మనం అర్లీగా వచ్చాం ఇందులో తన తప్పేం లేదని చెప్తాడు. ఒకసారి వసుకి ఫోన్ చేయమని ఫణీంద్ర అంటాడు. మీటింగ్ కి బోర్డ్ మెంబర్స్ అందరూ వచ్చారని చెప్పడంతో వస్తున్నానని చెపుతుంది. ఇంతలో కొరియర్ వచ్చిందని చెప్పి పార్సిల్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో రిషి  బ్రేస్ లెట్ ఉంటుంది. అది చూసి వసు షాక్ అవుతుంది. అందులో ఓ లెటర్ ఉంటుంది.  నీకొచ్చిన బ్రేస్ లేట్ నీ భర్తది. నువ్వు నీ భర్తని కలవాలని అనుకుంటే వెంటనే నేను చెప్పిన అడ్రస్ కి ఎవరికీ చెప్పకుండా రా. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా చెప్పినా, లేట్ చేసిన నీ భర్తని నువ్వు జన్మలో చూడలేవు అని లెటర్ లో ఉంటుంది. బోర్డు మీటింగ్ కి రావడం లేదని మావయ్యకి చెప్తే ఎందుకని అడుగుతారు. ఏం చెప్పాలి. ముందు ఈ అడ్రస్ కి వెళ్తాను రిషి సర్ ని చూడాలని వసు బయల్దేరుతుంది.
ఎపిసోడ్ ముగిసింది.
Exit mobile version