- కళాశాల విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఇంటర్ బోర్డు…
- హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ కళాశాలకే పరిమితం
- ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్స్ తిరస్కరణ
తాండూర్ మార్చు 10 జనవాహిని ప్రతినిధి :- ఈ నెల 15 నుండి ఇంటర్ పరీక్షలు ఉండటంతో హాల్ టికెట్ల ప్రక్రియ కళాశాలలో జోరుగా సాగుతుంది. ఆయా కళాశాలలో కొంతమేర ఫీజులు చెల్లించినప్పటికీ పెండింగ్లో ఉన్న ఫీజులు పూర్తిస్థాయిలో చేలిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు కళాశాల యాజమాన్యాలు. హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియను ఇంటర్నెట్లో పెట్టిన ఇంటర్ బోర్డు అధికారులు కేవలం కళాశాల లాగిన్ కే పరిమితం చేయడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసేందుకు ఇంటర్నెట్ల వద్ద క్యూ కట్టినప్పటికీ హాల్ టికెట్లు రాకపోవడంతో వెన్ను తిరుగుతున్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకున్న కళాశాల విద్యార్థులకు షాక్ ఇంటర్ బోర్డు షాక్ ఇచ్చింది. ఇంటర్
హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ కళాశాల లాగిన్ కే పరిమితం చేయడంతో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్స్ ఇచ్చేది లేదంటూ కళాశాల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. ఫీజులు వసూలు చేసేందుకు సరైన సమయం ఇదేనంటూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు కళాశాల నిర్వాహకులు. దీంతోవిద్యార్థుల తల్లిదండ్రులు చేసేదిలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు.ఈ కళాశాల యాజమాన్యానికి ఇంటర్ బోర్డు తల వంచింది అంటూ విమర్శిస్తున్నారు.