• కేశవరెడ్డి లో దారుణం… విద్యార్థి మృతి
  • బెర్త్ పై నుండి కింద పడ్డాడు- కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం
  • ఉపాధ్యాయుడు కారణంగానే మృతి చెందాడు- తల్లిదండ్రుల ఆరోపణ
  • కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యంపై చనుగోముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
  • దర్యాప్తు ప్రారంభించిన విద్యాశాఖ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 4( జనవాహిని న్యూస్) :- సరస్వతి నిలయాల్లో దారుణాలు జరిగిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా పాఠశాల యాజమాన్యం ఫీజులు దండుకుంటున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. నిర్బంధ విద్య పేరుతో విద్యార్థులను టార్చర్ చేయడం వారి వేధింపులు భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సంఘటనలు తరచూ జరుగుతున్నాయి విద్యాలయాలు వరుసగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి మొన్న శ్రీ చైతన్య నిన్న నారాయణ బృంగి ఇవాళ కేశవరెడ్డి ఇలా ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క రకమైన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్య శాఖ తనిఖీ పాఠశాలల్లో కొరవడిన కారణంగానే అక్కడ జరుగుతున్న దారుణాలు వెలుగులోకి రావడం లేదు. యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత విద్యార్థుల మృతి చెందిన తర్వాత విద్యశాఖ కదిలి విచారణ జరుగుతుంది. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు విద్యాలయాల్లో దారుణం ఆగడం లేదు చదవంటేనే వణుకు పుట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది వివరాల్లోకి వెళితే..*వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో దారుణం చోటు చేసుకుందికేశవరెడ్డి పాఠశాలకు చెందిన సాత్విక్ మూడవ తరగతి విద్యార్థి మృతి చెందాడుపాఠశాలలో ఉపాధ్యాయుడు చితక బాధడంతో అస్వస్థతకు గురి అయిన విద్యార్థి ఇంటికి తీసుకువెళ్లి తర్వాత మృతి చెందినట్లుతల్లిదండ్రులు ఆరోపించారు తమ కొడుకును బతికించుకోవడానికి శక్తి కొలది ప్రయత్నించిచికిత్స అందించిన చికిత్స పొందుతూ పొందుతూ సాత్విక్ విద్యార్థి మృతి చెందాడుతన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారుపాఠశాల యజమాన్యం మాత్రం బెడ్ పై నుంచి పడడంతో ఇంటికి తీసుకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ మృతి చెందాడు కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం తెలియజేసింది కేశవరెడ్డి పాఠశాలలో మృతి చెందిన బాలుడి మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినవాడు. ఈ విషయమై విద్య శాఖ దర్యాప్తు ప్రారంభించింది అలాగే పోలీస్ శాఖ దర్యాప్తు ప్రారంభించింది దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది వరుస సంఘటనలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను చితకబాదిన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here