• గిరిజన క్రీడాకారుడిని అభినందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు విట్టల్ రెడ్డి…
  • అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద లీగ్ అవార్డును సొంతం చేసుకున్నాం యువకుడు.
  • ఆనందోత్సవాలలో గిరిజన కుటుంబం…

తాండూర్ రూరల్ ఫిబ్రవరి 25 జనవాహిని ప్రతినిధి :- వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మైసమ్మ తండా కు చెందిన పవర్ సునీల్ అనే యువ క్రీడాకారుడు అండర్స్ 16 క్రికెట్ టోర్నమెంటులో మంచి ప్రతిభ కనబరిచి క్రీడాకారుడు పవర్ సునీల్ ప్లేయర్ అఫ్ ది లీగ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రెడిట్ అకరుడు ని మరింత ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటాడని తాండాకు చెందిన కొందరు అభినందిస్తున్నారు. శనివారం రోజు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డిని క్రీడాకారుడు సునీల్ తన కుటుంబ సభ్యులతో కలవడంతో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు విట్టల్ రెడ్డి క్రీడాకారుడుని అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. వికారాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకుంటున్న క్రీడాకారుడు సునీల్ పవర్, క్రీడలలో మంచి నైపుణ్యత సాధించి విద్యలోనూ ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ కౌన్సిలర్ వెంకట రాములు నాయక్, తాండ వాసులు అరుణ్ రాథోడ్, సంతోష్, కిషన్ పవర్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here