- ఈనెల 26 నుండి లోకయ్య గౌడ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు….
- ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదు బహుమతులు..
- బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్ సి గౌడ్
తాండూర్ రూరల్ ఫిబ్రవరి 23 జనవాహిని ప్రతినిధి :- ఈనెల 26 నుండి లోకయ్య గౌడ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ తాండూరు మండల అధ్యక్షుడు రావులపల్లి చంద్రశేఖర్ గౌడ్ (ఆర్ సి గౌడ్)ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత లోకయ్య గౌడ్ జ్ఞాపకార్థం లోకయ్య గౌడ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు పోటీలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఇట్టి క్రికెట్ టోర్నమెంటు లో పాల్గొనాలని క్రీడాకారులు ముందుగానే టీం కు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాల కోసం టోర్నమెంటు ఆర్గనైజర్స్ నరేందర్ సెల్ నెంబర్ 9901961646, కు గాని జి భరత్ రెడ్డి సెల్ నెంబర్ 9393979738, కు గాని గణేష్ 6303930149,కు గాని 9381316682 నంబర్లకు సంప్రదిస్తే పూర్తి సమాచారం తెలియజేస్తారని గుర్తు చేశారు. ఇట్టి క్రికెట్ టోర్నమెంట్లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి అనుమతించబడుతుందని పేర్కొన్నారు.