• బిజెపి నేత మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై బి ఆర్ ఎస్ వర్గీయుల దాడి….
  • ఫర్నిచర్ కిటికీల అద్దాలు ధ్వంసం
  • ప్రాణభయంతో బిక్కుబిక్కుమన్న బిజెపి నేత కుటుంబ సభ్యులు
  • పోలీసుల రంగ ప్రవేశం లాఠీ చార్జి
  • ఎమ్మెల్యే పైలెట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా భగ్గుమన్న వర్గీయులు
  • తమ కుటుంబానికి రక్షణ లేదు- పోలీసులు సహకరించడం లేదు
  • గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ వ్యాఖ్య…

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21(జనవాహిని న్యూస్) :- అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పార్టీల మధ్య పోరు మొదలయ్యింది. పార్టీలను నాయకులను టార్గెట్ చేస్తూ భౌతిక దాడులు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోలీసులకు తలపోటుగా మారింది. వివరాల్లోకి వెళితే… వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బిజెపి నేత మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై బి ఆర్ఎస్ పార్టీ వర్గీయులు సామూహిక దాడికి పాల్పడ్డారు. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై బిజెపి నేత మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆగ్రహంతో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడినట్లు తాండూర్ పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పొద్దు పోయాక ఈ దాడి జరిగింది. యాలాల పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడిపై శివ స్వాముల దాడి. పోలీసుల విధులకు భంగం కలగడానికి బిజెపి నేత మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ వారిని ఉసిగొల్పారానే కారణంతో యాలాల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో 14 రోజులపాటు పరిగి జైల్లో ఉన్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో పరిగి జైలు నుంచి నేరుగా భారీ కాన్వాయ్ తో సొంత ఇల్లు తాండూరుకు సోమవారం రాత్రి చేరుకున్నారు. జైలుకు వెళ్లే ముందు… జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహంతో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పొద్దు పోయాక బిజెపి నేత మురళీకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉండగా బి ఆర్ఎస్ పార్టీ వర్గీయులు సామూహిక దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇంటి కిటికీల అద్దాలు ఫర్నిచర్ ఇతర విలువైన వస్తువులు ధ్వంసం చేశారు బి ఆర్ఎస్ వర్గీయులు సామూహిక దాడి చేయడంతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో మురళి కృష్ణ గౌడ్ కుటుంబం ప్రాణభయంతో ఇంట్లోనే బిక్కుబక్కుమంటూ తలదాచుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలియగానే తాండూర్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బి ఆర్ఎస్ పార్టీ వర్గీయుల దాడిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పరిస్థితి చేయిజారిపోవడంతో లాటి చార్జి చేయవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో తాండూర్ పట్టణంలో ఒక్కసారిగా ఉదృత వాతావరణం నెలకొంది ఈ విషయం తెలియగానే బిజెపి పార్టీ వర్గీయులు బి ఆర్ఎస్ పార్టీ వర్గీయులను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ విషయమై తాండూర్ పోలీసులు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డికి సమాచారం అందించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూరులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మాజీ గ్రంధాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కుటుంబానికి రక్షణగా టికెట్ ఏర్పాటు చేశారు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై దాడికి పాల్పడ్డ బి ఆర్ఎస్ పార్టీ వర్గీయులను గుర్తించి పట్టుకోవడానికి తాండూర్ పోలీసులు వేట మొదలుపెట్టారు బిజెపి నేత మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై దాడి విషయం తెలియగానే రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు మరి కొంతమంది సీనియర్ నాయకులు తాండూర్ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు నగరంలో నే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ స్పందించారు. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనను టార్గెట్ చేసి తమ పార్టీ వర్గీయుల చే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తన మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని తనకు రావలసిన వాటా ఇవ్వని కారణంగానే విభేదాలు వచ్చాయని అన్నారు గత మూడు సంవత్సరాలుగా తనను మానసికంగా భౌతికంగా వ్యాపార పరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమ వ్యాపార లావాదేవీల గుట్టురట్టు చేసిన కారణంగానే తాను వారికి టార్గెట్ అయ్యానని తాను పార్టీ వదలవలసి వచ్చిందని అన్నారు ఎమ్మెల్యే తండ్రి వేధింపులు భరించలేక అనేకసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాల నాని అలాగే పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలియజేశారు కానీ పోలీసులు తమకు సహకరించడం లేదని ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు సోమవారం దాడికి ముందు ఇద్దరు పోలీసులు తన ఇంటి ముందు ఆగారని తర్వాతనే బి ఆర్ ఎస్ పార్టీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు పోలీసులు చూస్తుండగానే తమ కుటుంబ సభ్యులపై దాడి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు మంచి వాతావరణం లో ఉన్న పట్టణాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాశనం చేస్తున్నారని యువతను తప్పుదారి పట్టించి భౌతిక దాడులకు ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు తాండూర్ పట్టణంలో తమ కుటుంబానికి రక్షణ లేదని పోలీసులు సహకరించడం లేదని తన కుటుంబానికి జరగరానిదేదైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించవలసి ఉంటుందని ఆరోపించారు కాగా ఈ సంఘటనపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here