• కామపిశాచి ఉదంతం పై విచారణ…
  • ఉపాధ్యాయులపై వేటు…?
  • సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు….

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 (జనవాహిని న్యూస్) :- ఉపాధ్యాయులు చేసిన చిన్న తప్పిదం… ఆ విద్యార్థి జీవితం సర్వనాశనమైంది. పదవ తరగతి పరీక్షలు రాయవలసిన విద్యార్థి మానసికక్షోభకు గురి అవుతుంది. విచారణ పేరుతో అధికారుల ముందుకు వచ్చి తలంచుకోవలసిన పరిస్థితి వస్తుంది సమాజంలో విద్యార్థిని పట్ల చులకన భావం ఏర్పడుతుంది. ఇందుకు బాధ్యులు ఎవరు…? ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు బాధిత కుటుంబాలను వేధిస్తుంది. విహారయాత్రకు పంపడమే మహా పాపమైంది. పైసా పైసా కూడబెట్టి పై చదువు చదివించాలని వారి కల చెదిరిపోయింది. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి… వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత అగ్గనూరు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక దాడి సంఘటనపై విద్యాశాఖ స్పందించింది. వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి విచారణకు ఆదేశించారు. యాలాల్ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డిని విచారణ అధికారిగా నియమిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని డిఇఓ రేణుకా దేవి ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు యాలాల మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి విచారణ చేపట్టారు అగ్గనూరు పాఠశాల నుంచి విహారయాత్ర కోసం 89 మంది విద్యార్థులు వెళ్లినట్లు విచారణలో తేలింది వీరితో పాటు వీరి ఆలన పాలన చూడడానికి 9 మంది ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు అయితే తిరుగు ప్రయాణంలో ఆలస్యం జరిగిన కారణంగా పెర్కంపల్లి గ్రామ సర్పంచ్ ఈశ్వరమ్మ తమ్ముడు రాఘవులు కారులో బాలికలను పంపించినట్లు విచారణలో తేలిందని యాలాల మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి తెలియజేశారు విద్యార్థులను ఇంటికి భద్రంగా చేరవేర్చడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్య ధోరణితో ఉన్నట్లు తమ గుర్తించామని జరిగిన సంఘటనపై సమగ్ర నివేదిక డిఇఓ కు అందజేసినట్లు ఆయన తెలియజేశారు నివేదిక అనంతరం ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు కాగా విద్యార్థినికి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేకపోతున్నారు కొన్ని నెలల్లో 10వ తరగతి పరీక్షలు రాయవలసిన విద్యార్థి జీవితం ఒక కామాంధుడు చేతిలో నాశనం కావలసిన పరిస్థితి ఏర్పడింది ఉపాధ్యాయుల తప్పిదం వల్ల జరిగిన అన్యాయాన్ని గురించి బాధిత విద్యార్థిని ఉపాధ్యాయులకు తెలియజేసిన వారి పట్టించుకోకపోవడం కోస మెరుపు… ఎవరో నిర్లక్ష్యం అశ్రద్ధ చేసి పంపిస్తే తనకు అన్యాయం జరిగితే ఇక్కడ అశ్రద్ధ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విసుగు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు సైతం నిర్ణయానికి వచ్చింది ఆమె కుటుంబ సభ్యులు గమనించి అప్రమత్తం కావడంతో బాలిక క్షేమంగా ఉంది. కానీ ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేకపోతున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి యాలాల పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది శాఖపరమైన విచారణ పూర్తయినందున ఉపాధ్యాయులపై వేటు పడే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here