తాండూర్ రూరల్ ఫిబ్రవరి 8 జనవాహిని ప్రతినిధి :- తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మాల ఎంకప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఆకుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.మంగళవారం రోజు గ్రామానికి చేరుకున్న బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మృతుడి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల కోసమని రూ 3500ల రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పేదవాడికి ఆర్థిక సహాయం అందజేశాననే సంతృప్తి నాలో కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హసేన్ పటేల్ , మాల గుండప్ప, చాకలి మొగలప్ప, నరేష్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here