- కాంగ్రెస్ బీఎస్పీ దోస్తీ.. ఎమ్మెల్యేకు నిరసన సెగ…!
- బంటారం తోర మామిడి గ్రామాల్లో ముందస్తు అరెస్ట్
- నాలుగేళ్ల అభివృద్ధి.. మీతో -నేను కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం
- యధావిధిగా మీతో- నేను కార్యక్రమం కొనసాగింపు...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 31 (జనవాహిని న్యూస్) :- తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు రాకముందే.. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బి ఆర్ ఎస్ పార్టీపై సమర శంఖారావం పూరించాయి. అధికారం పార్టీ కార్యక్రమాలను అడ్డుకొని ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బంటారం మండల కేంద్రంలో బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ జతకట్టి అధికార పార్టీ అధికార కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నాయకుల ముందస్తు అరెస్ట్ జరిగింది. ఎమ్మెల్యే మీతో- నేను కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా బంటారం తోర మామిడి గ్రామాల్లో కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నాయకుల ముందస్తు అరెస్ట్ జరిగింది. బంటారం పోలీసులు మంగళవారం తెల్లవారుజాము నుంచి కాంగ్రెస్ బీఎస్పీ నాయకులను అరెస్టు చేసి బంటారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీతో నేను- కార్యక్రమం తొరమామిడి గ్రామంలో మంగళవారం జరగనున్న కారణంగా ఈ ముందస్తు అరెస్టులు జరిగాయి. బంటారం తోరమామిడి గ్రామాల్లో బీఎస్పీ కాంగ్రెస్ పార్టీలకు మంచి పట్టు ఉంది. గత నాలుగేళ్లుగా ఈ గ్రామాల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పెద్దగా అభివృద్ధి చేయలేదని తమ గ్రామాల్లో పర్యటించవద్దని కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నాయకులు నిరసన తెలియజేయడానికి పతక రచన చేశారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో వారు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. దీంతో రెండు గ్రామాల్లో హైడ్రామాతో పాటు ఉ దృక్త పరిస్థిత నెలకొంది. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ గెలుపొందిన తర్వాత నియోజకవర్గం లోని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి మీతో నేను కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కానీ ఇప్పటివరకు బంటారం తోరమామిడి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించలేదని తెలుస్తుంది. బి ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తే ఫంక్షన్ హాల్ లోకి పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అక్కడే కార్యక్రమాలు నిర్వహించి వెళ్లిపోయారు. తెలంగాణలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కారణంగా బంటారం తోరమామిడి గ్రామాల్లో పట్టు సాధించడానికి ఎమ్మెల్యే మీతో నేను కార్యక్రమం నిర్వహించడానికి పూనుకున్నారు. అందులో భాగంగానే మంగళవారం అధికార యంత్రాంగం తో కలిసి తోర మామిడి గ్రామంలో మీతో నేను కార్యక్రమం నిర్వహించారు దీంతో పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నాయకులను అరెస్టు చేశారు. మీతో నేను కార్యక్రమం సవ్యంగా జరగడానికి లైన్ క్లియర్ చేశారు. ఈ అరెస్టుల పట్ల కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. తమ గ్రామాల అభివృద్ధి విషయమై శాంతియుతంగా ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏమిటని మండిపడ్డారు. అభివృద్ధి విషయమై ప్రశ్నించే వారిని ఎంతో కాలం అరెస్టు చేయలేరని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీకి గుణపాఠం చెప్తారని మండి పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమం సవ్యంగా జరిగింది.