- జాతీయ జెండాకు ఎంత దౌర్భాగ్యం….!!
- ప్రతిసారి జాతీయ జెండాకు అవమానం
- అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం
- జిల్లా ప్రజల సర్వత్ర విమర్శ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 26 (జనవాహిని న్యూస్) :- చదువు రాని వాడు… వింత పశువు అన్నాడు ఒక కవి. దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న చదువుకున్న కొందరు మాత్రం ఇంకా వింత పశువుగా ప్రవర్తిస్తున్నారు అడుగడుగునా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందులో నిరుద్యోగస్తులున్నారు అధికారులు ఉన్నారు. ఏడాదికి రెండుసార్లు జరిగే జాతీయ జెండా పండగ సందర్భంగా జిల్లాలో ఏదో ఒకచోట జాతీయ జెండాను అవమానిస్తున్నారు. ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలపై ఎప్పుడు ఏదో ఒకచోట వారి నిర్లక్ష్యానికి నిలువు అద్దముల జాతీయ జెండా భంగపడుతుంది నిర్లక్ష్యం ధోరణికి గురి అవుతుంది ఇది ఎప్పుడు ఒకచోట బయటపడుతుంది నెలనెల లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము జీతాల కింద మెక్కిన కొందరు అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాకు అధికారులు ప్రజాప్రతినిధుల సాక్షిగా గురువారం అవమానం జరిగింది తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్ తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో జాతీయ జెండా తలకిందుగా ఎగిరింది అంబేద్కర్ పార్కులో ఈ సంఘటన జరిగింది తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్ ఈ జెండాను ఎగరవేశారు ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు జాతీయ జెండాకు వందనం చేసి ఎగురవేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్ అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో జెండాను ఎగరవేశారు కింది స్థాయి సిబ్బంది జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటుచేసి ఆర్ డి ఓ చేత ఎగురవేయించారు. ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొవచ్చు. ఇలా ప్రతి ఏడాది జరిగే రెండు జాతీయ పండుగలు జిల్లాలో ఏదో ఒకచోట ప్రతి ఏడాది జాతీయ జెండాలు తల క్రిందలుగా ఎగురుతున్నాయి ఈ విషయమై మీడియా సమాచారాన్ని హైలెట్ చేస్తున్న అధికారుల తీరులో మార్పు రావడం లేదు. అదే నిర్లక్ష్య ధోరణి ప్రతి ఏడాది కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలపై కొందరు అధికారులు ఇస్తారాజ్యంగా జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా జెండాకు అవమానం జరిగిన సంఘటనలు బయటపడ్డాయి ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసిన అందుకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించని కారణంగా ప్రతి ఏడాది ఈ నిర్లక్ష్య ధోరణి బయటపడుతుంది ఇప్పటికైనా అధికారులు జాతీయ జెండా ఏర్పాటు చేయడంపై నిర్లక్ష్య ధోరణితో కాకుండా దేశభక్తి అంకితభావంతో పనిచేస్తూ వచ్చే జాతీయ పండుగ నాటికి కన్న చిత్తశుద్ధితో పనిచేసి జాతీయ జెండాకు అవమానం జరగకుండా అన్ని సక్రమంగా ఏర్పాట్లు చేస్తారని ఆశిద్దాం….